రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,మునుగోడు ప్రతినిధి,ఏప్రిల్ 29,(గరుడ న్యూస్ ప్రతినిధి):
శాసనసభ ఎమ్మెల్యే కోటాలో నూతన ఎమ్మెల్సీగా నియమితులైన నెల్లికంటి సత్యం ఆత్మీయ అభినందన సభ మునుగోడులో పాల్గోని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కి పుష్పగుచ్చo ఇచ్చి శాలువాతో సన్మానించడం జరిగింది టీపీసీసీ నాయకులు బట్టు జగన్ యాదవ్.ఈ సందర్భంగా టీపీసీసీ నాయకులు బట్టు జగన్ యాదవ్ మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు సీపీఐ జిల్లా కార్యదర్శి సత్యం ని ఎమ్మెల్సీగా నియమించడం హర్షించదగ్గ విషయమని సత్యం విద్యార్ధి దశ నుండి కమ్యూనిస్ట్ భావజాలంతో ఏ పదవి ఆశించకుండా కష్టపడ్డా సత్యం నీ కమ్యూనిస్ట్ పార్టీ అధిష్టానం గుర్తించడం గొప్ప పరిణామo అన్నారు.యే పార్టీ అయిన పార్టీ కోసం పని చేసిన కార్యకర్తను గుర్తిస్తుంది అనడానికి సత్యం ఎన్నికే నిదర్శనం అన్నారు.ఈ కార్యక్రమంలో నాంపల్లి యాదవ సంఘం అధ్యక్షుడు,అప్పనబోయిన ఏడుకొండల యాదవ్,సైదులు,పంగ కొండయ్య,వస్త్య రమేశ్ నాయక్, మరియు కమ్యూనిస్టు నాయకులు కొన్రెడ్డి యాదయ్య,తదితరులు,పాల్గొన్నారు.



