

ఏప్రిల్ 28. కడప జిల్లా, మైదుకూరు నియోజకవర్గం, బ్రహ్మంగారిమఠం గరుడ న్యూస్ (ప్రతినిధి): ఏ. ఓబుల్ రెడ్డి: అందరూ సహకరిస్తే పేదలకు భూములు పంచుదాం అంటూ నవోదయ పాఠశాలకు స్థలం పరిశీలించిన ఎమ్మెల్యే -మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్. మండలంలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను జిల్లా కమిటీ ద్వారా సర్వే చేయిస్తు న్నామని, పూర్తయిన వెంటనే మండలంలో భూమిలేని నిరు పేదలకు ఎకరా, ఎకరంనర్రం చొప్పున భూములు పంచడం జరుగుతుందని మైదుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ పేర్కొన్నారు. మండలానికి మంజూరైన నవోదయ పాఠ శాలకు సోమవారం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శిరీష, బద్వేల్ ఆర్డిఓ చంద్రమోహన్, మండల తహసిల్దార్ దామో దర్ రెడ్డి, డిప్యూటీ తాసిల్దార్ జాన్సన్, పలు ప్రభుత్వ శాఖల అధికారులతో స్థలం పరిశీలన చేపట్టారు. ఎద్దులాయపల్లె సమీపంలోని 132 కెవి. సబ్ స్టేషన్ సమీపంలో ఉన్న 20 ఎకరాల ప్రభుత్వ భూములు పరిశీలించడం జరిగిందన్నారు. ఆ ప్రాంతంలో నేషనల్ హైవే రహదారి, బ్రహ్మంగారిమఠం, సిద్దయ్యగారి మఠం లాంటి పుణ్యక్షేత్రాల సమీపంలో ఏర్పాటు చేస్తే అన్ని విధాల ఆహ్లాదకర వాతావరణంలో సంతరించుకుంటుందని ఎమ్మెల్యే పుట్టా అన్నారు. అనంతరం కోట్లాది రూపాయ లతో నిర్మించిన మహా గురు కులం పాఠశాలను పరిశీలించి ప్రారంభానికి నోచుకోని కారణా లను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ ఏర్పాటు చేయలేదని ఉపాధ్యాయుల నియామకం
లాంటి వాటితోపాటు మరో15 లక్షల రూపాయల పెండింగ్ పనులు పూర్తిచేసి వచ్చే విద్యా సంవత్సరానికి విద్యార్థులతో ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తామన్నారు. అనంతరం తహసిల్దారు కార్యాలయం నందు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ మండలంలో ప్రభుత్వ భూములు అధికంగా ఉన్నాయని అవి చాలావరకు ఆక్రమణలకు గురయ్యాయని వాటిని గుర్తించడానికి స్పెషల్ కలెక్టర్ శిరీష, ఆర్డీవో చంద్ర మోహన్ లతో ఒక కమిటీని ఏర్పాటు చేశామని ఇప్పటికే 16 రెవెన్యూ గ్రామాల్లో సర్వే నిర్వహించారని, మిగిలిన ఆరు రెవెన్యూ గ్రామాల్లో రీ సర్వే నిర్వహించి, ఆక్రమణ లకు గురైన ప్రభుత్వ భూమిని తనపై నమ్మకంతో ఎమ్మెల్యేగా గెలిపించిన పేదలు,భూమిలేని నిరుపేదలకు పంచిపెట్టడమే తన లక్ష్యమని వారు అన్నారు. మండలంలో ఎన్నో దశాబ్దాల తరబడి భూ సమస్యలు పేరుకు పోయాయని, భూమి లేని నిరుపేదలు లేనివారిగానే ఉంటున్నారని ఆక్రమణదా రులు పదుల సంఖ్యలో భూమి ఆక్రమిస్తూనే ఉన్నారన్నారు. అలాగే పుణ్యక్షేత్రమైన బ్రహ్మంగారి మఠాన్ని రాష్ట్రం లోనే ప్రముఖ పుణ్యక్షేత్రం లాగా తీర్చిదిద్దడమే లక్షమని అన్నారు. మఠం ఐదు రోడ్ల కూడలి నందు భారీ త్రివర్ణ పతాకం, విగ్రహం ఏర్పాటు చేసి అద్భుతంగా తీర్చడమే తన సంకల్పం అన్నారు. అలాగే చౌదరివారిపల్లె, నంది పల్లె, ముడుమాల గ్రామాలకు వెళ్లే రోడ్డును డబల్ రోడ్డుగా ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం వీర బ్రహ్మంగారిని ప్రత్యేక పూజలతో దర్శించు కున్నారు. వీరికి మఠం ఫిట్ పర్సన్ శంకర్ బాలాజీ, మఠం మేనేజర్ ఈశ్వరయ్య ఆచారి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు అందించారు. వీరి వెంట టిడిపి మండల అధ్యక్షులు చెన్నుపల్లె సుబ్బారెడ్డి, యల్లటూరి సాంబ శివారెడ్డి, పూజ శివ యాదవ్, మల్లెపల్లె సర్పంచ్ నారాయణ, ఎస్. ఆర్. శ్రీనివాసులు రెడ్డి, ముడుమాల పోలిరెడ్డి, టిడిపి మండల ఉపాధ్యక్షులు నరసింహ గౌడ్, సుధాకర్ యాదవ్, పలువురు టిడిపి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



