
గరుడ ప్రతినిధి పుంగనూరు
పుంగనూరు మండలంలోని చంద్రమాకులపల్లి గ్రామంలో తాగునీటి ట్యాంకు దగ్గర పైపులకు మరమ్మతులు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ట్యాంకుకు నీరు సరఫరా చేసే పైపులు చెడిపోయి నీరు వృధాగా పోతుంది. మీ విషయమై పలమార్లు అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోయారు. తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
