
గరుడ ప్రతినిధి పుంగనూరు
మండలంలో చాలా చోట్ల ఒకరి పేరున గల ట్రాన్స్ ఫార్మర్లు ఇంకోక్కరి పెట్టడం, ఒకరి సర్వీసు లో ఇంకోక్కరు వాడుకోవడం జరుగుతుంది.ఇలా చెప్పుకుంటూ పోతే మండలం లో చాలా చోట్ల నిబందనలు ఉల్లంగించి కార్యాక్రమాలు చేస్తున్నారు. నిబందనల ప్రకారం ఐతే ఒకరి సర్వీసు ఇంకోక్కరు వాడకూడదు, కేబుల్ వేసేటప్పుడు ముప్పై మీటర్లు దాటితే ఖచ్చితంగా కొత్తపోల్ వేయాల్సి ఉండగా సుమారు ఎబ్బైఎనబై మీటర్లు కేబుల్ లాగిన దాఖలాలు ఉన్నాయి. అంతే కాకుండా చాలా చోట్ల సర్వీసులే ఒకచోట నుండి ఇంకోచోటికి మార్చేసిన పరిస్థితులు ఉన్నాయి.కరోనా సమయంలో చేసిన దరఖాస్తు కు నేటికి ట్రాన్స్ ఫార్మర్ రావడం లేదు,అంతే కాకుండా పుంగనూరు పరిధిలో పెద్దపంజాణి లో భూమి ఒకరిది, సర్వీసు కు చలాన్ కట్టినది ఒకరు, అలాగే వివాదం ఉన్న భూములకు, బ్లాక్ లో గల భూములకు సైతం విద్యుత్ శాఖ అధికారులు మెటీరియల్స్ ఇస్తున్నారు. ఈ నేపత్యంలో భారీగా నగదు చేతులు మారుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా పట్టణ ప్రాంతం లో ఏర్పాటు చేసిన మెస్ ల వల్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతుంది. కనీసం ట్రాన్స్ ఫార్మర్ ఎత్తు పెంచి, చుట్టుప్రక్కల గడ్డి తొలగించి, మెస్ వేయడంవలన ఉపయోగం ఉంటుంది, అంతే గాని ఎటువంటి ఎత్తు పెంచకుండా ట్రాన్స్ ఫార్మర్ కు కంచె వేయడం వలన ఏదైనా వాహనంగాని. జంతువు గాని డీ కొడితే సదరు మెస్ ట్రాన్స్ ఫార్మర్ పై పడి ఇంకా ఎక్కువ నష్టం సంభవించే ఆస్కారము ఉంది. కావున మొదట ట్రాన్స్ ఫార్మర్ ఎత్తు పెంచాలి కోరారు అలాగే ట్రాన్స్ ఫార్మర్ కి దిమ్ములు ఏర్పాటు చేయాలన్నారు..
