
రిపోర్టర్ సింగం కృష్ణ, భువనగిరి స్టార్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,ఏప్రిల్29,(గరుడ న్యూస్):
సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో భూభారతి అవగాహన సదస్సు లో పాల్గొన్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం.ఈ సందర్భంగా మునుగోడు శాసనసభ్యులు సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వం రాత్రికి రాత్రి ధరణి తీసుకువచ్చిందని రాజగోపాల్ రెడ్డి అన్నారు.గత ప్రభుత్వం రైతుల సమస్యలు ఆత్మహత్యలు పెరిగేలా చేసిందని ఆరోపించారు.రైతుల సమస్యలు తీర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకువచిందని,కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన భూభాగతి చట్టం వల్ల రైతులకు మేలు జరుగుతుందని చెప్పుకొచ్చారు.ఈ కార్యక్రమంలో కుంభం శ్రీనివాస్ రెడ్డి,జిల్లా కలెక్టర్,నారాయణపురం మండలం మాజీ ఎంపీపీ గుత్తా ఉమా ఫ్రేమ్ చందర్ రెడ్డి,బుజ్జి నాయక్,నారాయణపురం మాజీ ఎంపీటీసీ బచ్చన గోని గాలయ్య,ఎమ్మార్వో,ప్రభుత్వ అధికారులు,రైతులు,తదితరులు పాల్గొన్నారు.

