విశ్వనాథరెడ్డి కుటుంబ సభ్యులకు పరామర్శ – పార్టీ నేత మృతి బాధకరంఎం చెవిరెడ్డి మోహిత్ రెడ్డి

Sesha Ratnam
1 Min Read
తిరుపతి జిల్లా, పాకాల, గరుడ న్యూస్ (ప్రతినిధి): పాకాల టౌన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు విశ్వనాధ్ రెడ్డి గత రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందడంతో చంద్రగిరి నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాజీ తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. సోమవారం పాకాల చేరుకున్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన చిత్రపటం ముందు ఘనంగా నివాళులర్పించారు.  విశ్వనాథరెడ్డి పార్టీకి చేసిన సేవలను ఆయన కొనియాడారు. విశ్వనాధ్ రెడ్డి కుటుంబానికి అన్నివేళలా అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు తెలిపారు. పాకాల లో విశ్వనాథరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఎన్నో కార్యక్రమాలు చేశారని ఆయన గుర్తు చేసుకున్నారు. విశ్వనాధ రెడ్డి మృతి బాధాకరమన్నారు.  ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *