కొరియర్ కంటైనర్ కిందకు దూసుకెళ్లిన కారు : ఐదుగురు మృతి ఇద్దరికీ తీవ్ర గాయాలు : సంఘటనా స్థలాన్ని పరిశీలించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్,ఎస్పి హర్షవర్ధన్ రాజు

Sesha Ratnam
2 Min Read

తిరుపతి జిల్లా, పాకాల-గరుడ న్యూస్, ప్రతినిధి,ఏప్రిల్ 28: చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం నేండ్రకుంట సమీపంలోని కోనప‌్ప రెడ్డి పల్లి వద్ద పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. .తిరుపతి నుంచి వెళుతున్న కారు ముందు వెళుతున్న పాల ట్యాంకర్ ను ఢీకొన్న సంఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా,ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వారిలో కూడా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పాకాల పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఇలా ఉన్నాయి.జార్ఖండ్ రాష్ట్రం రాంచీ నుంచి  కొరియర్ లోడ్ కంటైనర్ లారీలో బెంగళూరుకు పోతోంది. తమిళనాడు లోని ఒకే కుటుంబానికి చెందిన భక్తులు తిరుమల దర్శనం అనంతరం కారులో తిరుగు ప్రమాణం చేస‌్తుండగా అత్యంత వేగంగా ముందు వెళ్తున్న కంటైనర్ ని వెనుక నుంచి ఢీ కొట్టింది.కారు ఢీ కొన్న శబ‌్దం విని కొరియర్ లోడ్ తీసుకుపోతున్న కంటైనర్ ను డ్రైవర్ 70 మీటర్ల దూరంలో రోడ్డు పక్కన ఆపాడు.కారు వేరే వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి కంటైనర్ ని ఢీ కొట్టింది. ఢీ కొట్టిన వేగానికి కారు  కంటైనర్ క్రింద దూరిపోయింది.సంఘటన స్థలంలోనే తమిళనాడుకు చెందిన ఐదుగురు భక‌్తులు మృతి చెందారు.ఒక చిన్నారి,ఒక పురుషుడి కి తీవ్ర గాయాలు అయ్యాయి. .అందులో చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికులు
సహాయక చర్యలలో పాల్గొన్నారు.మృతులు, క్షతగాత్రులు ఏడుగురు
ఒకే కుటుంబానికి చెందిన కావడం గమనార్హం. మృతి చెందిన వారిలో ఇద్దరు పురుషులు,ఇద్దరు స్త్రీలు,ఒక బాలుడు ఉన్నారు.విషయం తెలుసుకున్న పాకాల పోలీసు సంఘటన స్థలానికి వెళ్లి,పరిశీలించి సహాయ చర్యలు చేపట్టారు.సంఘటన స్థలంలోనే మృతి చెందిన అయిదుగురులో ఇద్దరిని  పోలీసులు గుర్తించారు. కృష్ణగిరి వద్ద హోసురు జి.ఆర్.బి నెయ్యి కంపెనీలో పని చేస్తున్న వారి కుటుంబంగా పోలీసులు తెలిపారు. మృతి చెందిన వారిలో త్యాగరాజన్, సాధన గా గుర్తించారు. మిగిలిన ముగ్గురిని గుర్తించాల్సి ఉంది.మృతదేహాలను తిరుపతి రుయా మార్చురీకి తరలించారు. పాకాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ.  ప్రమాదం చోటు చేసుకున్న కోనపరెడ్డిపల్లికి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్,ఎస్పి హర్షవర్ధన్ రాజు  హుటాహుటిన చేరుకున్నారు.సహాయక చర్యలలో పాలుపంచుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును స్థానికులను, పాకాల పోలీసులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించడానికి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలోని కోనప్ప రెడ్డి పల్లి వద్ద నాయుడుపేట జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తీరును  ఆరాతీశారు. ప్రమాదంలో తీవ్ర గాయాలు పాలైన వారికి మెరుగైన వైద్య సేవలను అందించాలని రుయా ఆస్పత్రి సిబ్బందికి మంత్రి సూచించారు.మృతి చెందిన తమిళుల కుటుంబాలకు సంతాపం తెలియజేసారు.ఇలాంటి ప్రమాద ఘటనలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మృతదేహాలను వారి గ్రామాలకు తరలించడానికి చర్యలు చేపట్టాలని అధికారులకు తెలిపారు.
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *