మోటార్ సైకిల్ రెడ్డిమోసలకు,DKT భూములే సాక్ష్యం

Kancharla Venkataih
2 Min Read

*గుంటలు చెరువులు* *ఖాళీ భూములు* కబ్జాలు*

మోటార్ సైకిల్ ఓనరు, మాజీ , పాలనలో ముందుండి DKT భూములా కబ్జా ఖాతాలకు ఇన్ఛార్జ్ గా వ్యవహరించిన వీరుడు

చట్టం నా చుట్టం ఎవరు నాకు అడ్డం నేను చెప్పిందే చట్టం అని హిట్లర్ల తో పోటీపడ్డ వీరాధర్ రెడ్డి

- Advertisement -
Ad image

కంచె చేనును మేసినట్లుగా, తల్లె పిల్లను మింగినట్లుగా ప్రభుత్వ భూములను కాపాడవలసిన అధికారులే, భూ బకాసురల అవతారం ఎత్తితే

కాళి భూములు కబ్జా చేసి డీకేటి భూములకు 22 A లో నుంచి తొలగించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన సంఘటన లో ప్రముఖ పాత్ర వహించిన రెవిన్యూ అధికారులు

2020 నుంచి 2024 వరకు కబ్జారాయుల పంట పండింది అనే చెప్పవచ్చు

కాళహస్తి నియోజకవర్గం లో వాంపల్లి,, వాగివేడు,, , తొట్టంబేడు మండలంలో చెరుకు రాకప్ప నాయుడు కండ్రిగ, రామచంద్రపురం, చిట్టత్తూరు, రేణుగుంట మండలంలో కరకంబాడి, తారక్ నగర్, లలో గుంటలు, చెరువులు, ఖాళీ భూములును శ్రీకాళహస్తి పాలకోవా ప్యాకెట్లను చేసి అమ్మి వేల కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించిన అంగ రాజ్య భోపాలుడు

తొట్టంబేడురెవెన్యూ లెక్క దాఖలా 26,28,29, చిలక మహాలక్ష్మి గుడి దగ్గర సుమారు 5 ఎకరాలు,అయినా మున్సిపాలిటీ దెబ్బలు ను

- Advertisement -
Ad image

రామచంద్రపురం దగ్గర 89/1లో ఎ 1-24 సె గుంట పోరంబోకును ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఎదురుగా ఉన్న ఈదులకుంట చెరువు కట్ట 42/1 ను
ఇలా చెప్పుకుంటూ పోతే కాశీ రామేశ్వరం కథలాగా ఉంటుంది,

కఠినమైన చట్టాలు కలిగినోళ్లకు వర్తించవు, అనేది చెప్పకనే మన కళ్ళ ముందు దర్శనమిస్తున్నాయి, కుటికి లేనోడు ఖాళీ స్థలంలో గుడిసె వేస్తే, పోలీస్ వాళ్ళతో పడగొట్టిస్తారు, పెద్ద పెద్దోళ్ళు అయితే, పోస్టర్ బ్యానర్ వేసి, పక్క ప్లాన్తో కబ్జా చేస్తాడు,
ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు, సంకెళ్లు వేసి న్యాయదేవత కళ్ళను తెరిపించి, ప్రజాస్వామ్యాన్ని రక్షించవలసిందిగా ప్రభుత్వ అధికారులకు పాలకులకు పేద ప్రజల కన్నీటి దండాలు అంటున్నారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *