

అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం పొట్టిదోరపాలెం వి ఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ వడ్డి సత్యారావు ఆధ్వర్యంలో lic రమేష్ అమ్మగారు క్రీ,శే,శ్రీమతి శ్రీనాధు కనకలక్ష్మి నాలుగువ వర్ధంతి సందర్భంగా గురువారం మెగా ఉచిత మెడికల్ క్యాంపు వీరవెల్లి అగ్రహారం గ్రామంలో శివాలయం దగ్గర నిర్వహిస్తున్నాం . VSR ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ వడ్డి సత్యారావు అన్ని గ్రామాల ఉపాధిపని దగ్గర వెళ్లి NRI అనిల్ నీరుకొండ హాస్పిటల్ తగరపువలస మరియు మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ విశాఖపట్నం నుంచి 20 మంది డాక్టర్స్ వస్తున్నారు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అని చెప్పి అలాగే డా,, సత్యారావు గుండెపోటుపై అవగాహన తెలిపి మెగా మెడికల్ క్యాంపు దగ్గర ఈసీజీ తీసి ,ఈసీజీలో ప్రాబ్లెమ్ ఉంటే ఉచిత బస్సుసౌకర్యం కల్పించి టూడిఇకో, ఉచితంగా తియ్యించి,వివిధ ఆరోగ్య సమస్యలతో ఉన్నవారికి కూడా ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తాం అని పేర్కొన్నారు,ప్రతి సోమవారం ఈ ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి ఏర్పాటు చేస్తున్నట్లు చైర్మన్ డాక్టర్ వడ్డీ సత్యారావు తెలిపారు. ఈ వైద్య సేవలు పొందడానికి వచ్చే వారు తప్పకుండా ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకురావలని ఈ అవకాశాన్ని పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా వినియోగించు కోవాలని సత్యారావు కోరారు.



