రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,మునుగోడు ప్రతినిధి, ఏప్రిల్ 30,(గరుడ న్యూస్):
సంస్థాన్ నారాయణపురం మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతుల మీదుగా జరిగింది.ఈ గృహప్రవేశ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,సంస్థాన్ నారాయణపురం మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు,చిమిర్యాల మాజీ సర్పంచ్ దోనూర్ జైపాల్ రెడ్డి పాల్గొని ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీను నాయక్,శ్రీరామ్ నాయక్,కార్యకర్తలు,తదితరులు,పాల్గొన్నారు.




