
గరుడ ప్రతినిధి పుంగనూరు
చౌడేపల్లి మండలం లోని ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ గంగమ్మ దేవస్థానం లో శుక్రవారం రాహుకాల అభిషేకాన్ని సాంప్రదాయ పద్దతిలో నిర్వహించారు.ఉదయాన్నే ప్రధాన అర్చకులు వేదపండితుల వేదమంత్రాలతో అమ్మవారికి ప్రత్యేకలంకరణ చేసి,విశిష్టాభిషేకం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో భక్తులు ,ఆలయ కార్మనిర్వాహణాధికారి,ఉపకమీషనర్ జే.ఏకాంబరం,ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.అమ్మవారి ఆశిస్సులకోసం వచ్చే భక్తుళకు ప్రతి శుక్రవారం అన్నదానం చేయడం ఆనవాయితీ గా వస్తుంది.ప్రతి వారము అమ్మవారి చే కోర్కెలు తీర్చబడిన భక్తులు దేవస్థానం ఆద్వర్యం లో అన్నదానం నిర్వహిస్తున్నారని,ఎవరైనా భక్తులు అన్నదానం చేయదలచిన వారు, పరిపాలన భవనంలో విరాలాళ్ళు ఇచ్చి రిసిప్ట్ పొందవలనని చెప్పారు ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది అర్చకులు భక్తులు పాల్గొన్నారు..
