
గరుడ ప్రతినిధి పుంగనూరు
పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల వైకాపా అధ్యక్షుడుగా మండలంలోని పెద్ద కొండా మరి కి చెందిన నాగభూషణ రెడ్డి నియమితులయ్యారు. మేరకు నాగభూషణ్ రెడ్డి మండల నాయకులతో కలసి శుక్రవారం తిరుపతిలో మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి నివాసానికి చేరుకుని కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి దామోదర్ రాజు, మాజీ ఎంపీపీలు అంజి బాబు రుప్పినమ్మ, వైస్ ఎంపీపీలు నరసింహ యాదవ్, సుధాకర్ రెడ్డి, కళ్యాణ్ భరత్,మిద్దింటి కిషోర్, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు

