
గరుడ ప్రతినిధి పుంగనూరు
పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం లోని పుదిపట్లలో వెలసివున్న వైష్ణవీ దేవి ఆలయం లో శుక్రవారం సందర్బంగా ప్రత్యేక పూజలు ,అభిషేకాలు నిర్వహించారు.అర్చకురాలు శ్రావణి ఉదయాన్నే ఆలయం లోని ఆంజనేయ స్వామి వారిని,వైష్ణవి దేవి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పంచామృతాభిషేకాలు చేశారు.అశేష సంఖ్య లో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.ఆమ్మవారిని దర్శించుకున్న భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమం లో ఆలమ నిర్మాణ దాత వినోద్ కుమార్ రెడ్డి భక్తాదులు పాల్గొన్నారు.
