
రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,మునుగోడు ప్రతినిధి,చౌటుప్పల్,మే03,(గరుడ న్యూస్):

బీసీలకు రాబోయే జనగణనతో పాటు కుల గణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఒత్తిడి తో నేనని యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దగోని మౌనిక రమేష్ గౌడ్ పేర్కొన్నారు.పెద్దగోని మౌనిక రమేష్ గౌడ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఒతిడి తోనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు.రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో హామీ ఇచ్చారని తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చి ప్రధాని మోడీ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి అన్నారు.దేశంలో అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శం అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.
