చిత్తూరు జిల్లా, కుప్పం కొత్తపేట గరుడ న్యూస్ (ప్రతినిధి): R. మంజునాథ్ కళ్యాణ్ గారి ఆశయాలను నాయకత్వాన్ని ఆకర్షితులై కుప్పం నియోజకవర్గం కుప్పం మండలం అడివిబుదుగురూ పంచాయతీకి చెందిన 20 మంది యువకులు జనసేన పార్టీలో చేరారు, వారిని జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి కుప్పం జనసేన ఇన్చార్జి నరేష్ గారు ఆహ్వానించడం జరిగింది.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికలు రానున్నడంతో కూటమి నాయకులకు మద్దతుగా పని చెయ్యాలని సూచిస్తూ జనసేన పార్టీని మరింత బలోపేతం చెయ్యడానికి ప్రతీ జనసైనికుడు కృషి చేయాలని అలాగే కూటమి ప్రభుత్వం కుప్పం శాసనసభ సభ్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ద్వారా జరుగుతున్న అభివృధి సంక్షేమాలు ప్రజలు వద్దకు తీసుకెళ్లాలని ఎన్డీయే ప్రభుత్వం చేస్తున మంచి పనులు ప్రతి వాడ తెలియచెయ్యాలని నరేష్ గారు తెలిపారు.