“దేశ్ రత్న” అవార్డుతో ఘన సత్కారం అందుకున్న
మహేంద్రబాబు.
ఏప్రిల్, 6, 2025.న ప్రొఫెషనల్ ఎక్స్ప్రెస్ అవార్డు. ఏప్రిల్ 14న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వారసత్వx పురస్కారం.
ఏప్రిల్ 27న గౌరవ డాక్టరేట్ తో పండిట్ దీన దయాల్ ఉపాధ్యాయ పీఠం నిర్వాహకులతో సత్కారం. ఏప్రిల్ 29న ప్రభుత్వంలో నీ వివిధ శాఖలలో ఉత్తమ సేవలను అందించిన వారికి ప్రతి ఏటా ఇచ్చే దేశ రత్న అవార్డుతో మహేంద్ర బాబు కు ఢిల్లీలో ఘనంగా సత్కరించడం జరిగింది.
మహబూబాబాద్ పట్టణానికి చెందిన మహేంద్ర బాబు 2009లో భారతీయ వాయుసేనలో చేరారు. మానుకోట పట్టణంలోని గుమ్మడూరు కాలనీకి చెందిన సూర్ణపు ముత్తయ్య సుగుణమ్మ దంపతుల ఏకైక పుత్రుడు మహేంద్ర బాబు.
విశాఖపట్నంలోని టిఫిన్ అకాడమీలో ఇంటర్మీడియట్ విద్యతో పాటు రక్షణ శిక్షణ పొంది తన 18 9 లో భారతీయ వాయుసేనలో చేరారు. _16 సంవత్సరాలుగా దేశానికి తన సేవలను అందిస్తూ ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులను తన ఉపన్యాసాల ద్వారా రక్షణ శాఖలో చేరేలా ప్రోత్సహిస్తున్నారు. తన మిత్రుడు మానుకోట పట్టణ నివాసి డాక్టర్ సూర్ణపు మహేంద్ర బాబు” దేశ రత్న” అవార్డు రావడం మానుకోట పట్టణానికి ఎంతో గర్వకారణమని తమ సంతోషాలను వ్యక్తపరిచారు.
_తనకు సoక్రమించిన ఈ అవార్డులను పహాల్గాo ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు అంకితం చేసిన డాక్టర్ మహేంద్ర బాబు.
మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి, మే 04,( గరుడ న్యూస్).
అతి చిన్న వయసులో గౌరవ డాక్టరేట్, దేశ్ రత్న పురస్కారం
డాక్టర్ బి.ఆర్, అంబేద్కర్ వారసత్వ పురస్కారాలతో పాటు ఎన్నో జాతీయ స్థాయి అవార్డ్ లను సాధించిన తరువాత మొట్టమొదటిసారి మహబూబాబాద్ వస్తున్న మన మానుకోట బిడ్డ డా . సూర్ణపు మహేందర్ బాబుకు డా. బి, ఆర్, అంబేద్కర్ యువజన సంఘం వారు ఘనంగా స్వాగతం పలుకి సత్కరించటం జరిగింది.
తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గుమ్మడూరు కాలనీకి చెందిన సూర్నపు ముత్తయ్య , సుగుణ దంపతుల ఏకైక పుత్రుడు మహేందర్ బాబు . తెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల నర్సంపేట లో పదవ తరగతి వరకు చదువుకోవడం జరిగింది. ఆ తరువాత విశాఖ పట్టణంలోని డిఫెన్స్ అకాడమీ లో ఇంటర్మీడియట్ విద్యతో పాటు రక్షణ రంగంలో శిక్షణ పొంది తన 18వ ఏట 2009వ సంవత్సరంలో భారతీయ వాయుసేనలో చేరారు. అప్పటినుండి నేటి వరకు 16 సంవత్సరాలుగా దేశానికి తన సేవలను అందిస్తూ ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులను తన ఉపన్యాసాల ద్వారా రక్షణ శాఖలో చేరేలా ప్రోత్సహించే కార్యక్రమాలు చేస్తున్నారు. మహేందర్ బాబు కి 06 ఏప్రిల్ 25 న ప్రొఫెషనల్ ఎక్స్లెన్స్ అవార్డ్, 14 ఏప్రిల్ 25 న డా. బి,ఆర్, అంబేద్కర్ వారసత్వ పురస్కారం పొందండం జరిగింది. మహేందర్ బాబు సేవలను గుర్తించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ విద్యాపీఠం నిర్వాహకులు 27 ఏప్రి ల్ 25 న గౌరవ డాక్టరేట్ తో సత్కరించడం జరిగింది. అదేవిధంగా 29 ఏప్రిల్ 25 న ప్రభుత్వ రంగ లో వివిధ శాఖలో ఉత్తమ సేవలను అందించిన వారికి ప్రతి ఏటా ఇచ్చే “దేశ్ రత్న” అవార్డ్ తో మహేందర్ బాబు ని 29 ఏప్రిల్ 25 న ఢిల్లీ లో సత్కరించడం జరిగింది.ఈ సందర్భంగా డా. సూర్ణపు మహేందర్ బాబు మాట్లాడుతూ, నాకు దక్కిన ఈ గౌరవ పురస్కారాలు పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు అంకితం చేసారు.



