గరుడ ప్రతినిధి పుంగనూరు
పుంగనూరు నియోజకవర్గంలో చౌడేపల్లి మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రం మైన బోయకొండ గంగమ్మ దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది.ఇటు ఆంధ్ర ప్రదేశ్,కర్ణాటక,తమిళనాడు నుండి భక్తులు అధికంగా వచ్చారు,భక్తులు ఉదయం నుండి క్యూలైన్లలో అమ్మవారి మొక్కులు తీర్చుకోవడానికి బారులు తీరారు.ప్రధాన అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు.భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కార్యనిర్వాహణాధికారి మరియు ఉపకమీషనర్ ఏకాంబరం ఏర్పాట్లను పరిశీలించారు.చలువ పందిళ్ళు ఏర్పాటు చేశారు. బెంగళూరుకి చెందిన బి.ఎం కేశవులు ఉచిత అన్నదానానికి విరాళంగా 10,000 రూపాయలు ఇచ్చారు అనంతరం ఉచిత ప్రసాదాల వద్ద తోపులాటలు లేకుండా అందరూ క్యూలైన్లో వెళ్ళి ప్రసాదాలు తీసుకొనే విధముగా సిబ్బందిని ఆదేశించారు, అనునిత్యం సమాచార కేంద్రం నుండి ఆలయ ప్రాంగణం లో జేబుదొంగలున్నారని,తమ విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలని భక్తులకు హెచ్చరికలు చేశారు,ఎవరికైనా ఏదైనా అసౌకర్యం కలిగినా,ఎవరైనా పిల్లలు తప్పిపోయినా పరిపాలనా కార్యాలయం ఎదురుగా గల సమాచార కేంద్రం లో సంప్రదించాలని సూచించడం జరిగింది.ఈ కార్యక్రమం లో ఆయన వెంట సూపరింటెండెంట్ రామనాథం,సుధాకర్ రెడ్డి,మణి తదితరులు పాల్గొన్నారు




