
గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగనూరు పట్టణంలోని మెడికల్ షాపులు అనుమతు లేని మత్తుమందులు విక్రయిస్తున్నారని ఇలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామని శ్రీ సుబ్బరాయుడు హెచ్చరించారు. ఆదివారం రాత్రి ఎస్ఐ లోకేష్ తో కలిసి పోలీస్ స్టేషన్లో మెడికల్ షాప్ యజమానులతో కలిసి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సీఐ సుబ్బరాయుడు మాట్లాడుతూ పట్టణంలోని యువతకు టాబ్లెట్లు సిరప్ రూపంలో మత్తుమందులు విక్రయిస్తున్నారని ఫిర్యాదులు అందుతున్నాయని వైద్యులు అనుమతులు లేకుండా మత్తుమందులు నిద్ర మాత్రలు ప్రభుత్వం నిర్ణయించిన మేరకు విక్రయించాలని తెలిపారు లేనియెడల షాప్ యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు