
గరుడ ప్రతినిధి

పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రైవేట్ అంబులెన్స్ దందా, నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ టీం సభ్యులు సోమవారం జాయింట్ కలెక్టర్ విద్యా దరికి మున్సిపల్ కార్యాలయం నందు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎన్ హెచ్ ఆర్ సి సి ఎఫ్ టీం సభ్యులు మాట్లాడుతూ… ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రైవేట్ అంబులెన్సులు రోగులను ఆర్థికంగా దోచుకుంటున్నారని సకాలంలో ప్రభుత్వ ఆంబులెన్స్ లేని సౌకర్యం లేకపోవడంతో ఇదే అదునుగా చేసుకున్న ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులు పేద రోగులపట్ల విచక్షణారహితంగా దందాలు చేసుకుంటూ వసూళ్లు లకు పాల్పడుతూ ఇబ్బంది పెడుతున్నట్లు కూడా ఇదివరకే మనం ఎన్నో కథనాల్లో కూడా చూసాం అన్నారు. జెసి గారికి వినతి పత్రం అందజేయడం జరిగిందని వారు తెలిపారు. ఈ విషయంపై జేసీ గారు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ నేషనల్ జనరల్ సెక్రెటరీ మధుమోహన్రావు, పలమనేరు నియోజకవర్గం అధ్యక్షులు జిక్రియ, పలమనేరు మీడియా ఆఫీసర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.