



✳️తిరుపతిలో జరగబోవు గంగమ్మ జాతరకు ఎంతమంది ప్రజలు వస్తారని దానికి తగ్గట్టుగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ గారు సూచించారు. ✳️దేవాలయంలో క్యూలైన్లు పరిశీలించి తగిన బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు ✳️గంగమ్మ కమిటీ వాళ్ళతో మాట్లాడి క్యూలైన్సును స్ట్రాంగ్ ఏర్పాటు చేయమని సూచించారు. ✳️ఏ వైపున భక్తులు రద్దీ ఎక్కువ ఉంటుందో ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ.. అటు వైపు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా సిబ్బందిని ఆదేశించారు. ✳️రద్దీ ఎక్కువ ఉంటుందో ఆ ప్రాంతాల్లో స్ట్రాంగ్ గా క్యూలైన్స్ ఏర్పాటు చేయవలసిందిగా సూచించారు.✳️గంగమ్మ జాతర జరుగు ఈ వారం రోజులు కూడా పోలీస్ సిబ్బంది ఎంతో నియమ నిబద్ధతతో విధులు నిర్వహించాలన్నారు.✳️జాతరలో ముఖ్యంగా చివరి రోజు అయినటువంటి చెంప నరికి కార్యక్రమం ఆ ముందు రెండు రోజులు కూడా కొంచెం రద్దీ ఎక్కువగా ఉంటుంది అని అధికారులు ఎస్పీ గారికి తెలిపారు. ✳️ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీస్ అధికారులు, సిబ్బందితో పటిష్టమైన భద్రాతా ఏర్పాట్లు చేయాలన్నారు. ✳️ట్రాఫిక్ పరంగా కూడా ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కలగకుండా పోలీసు సిబ్బంది విధులు నిర్వహించాలని సూచించినారు. ట్రాఫిక్ రద్దీ ని బట్టి డైవర్షన్ చేసే విధంగా ప్లాన్ అఫ్ యాక్షన్ రూపొదించు కొవాలని అధికారులను ఆదేశించారు. ఎవరికి కేటాయించిన విధులను వారు సక్రమంగా, నిజాయితీగా నిర్వర్తించాలని, ప్రజలతో సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. ✳️12,13వ తేదీలలో గంగమ్మ ఆలయానికి చేరుకునే మార్గాల నందు భక్తులకు, ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా దారి మళ్లింపు చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో శ్రీ కె.రవి మనోహరచారి అదనపు ఎస్పీ పరిపాలన, శ్రీ భక్తవత్సలం డి.ఎస్.పి తిరుపతి టౌను, శ్రీ రామకృష్ణ చారి ట్రాఫిక్ డిఎస్పి శ్రీ సాధిక్ ఆలీ, శ్రీ. శ్రీనివావాసులు సీఐ ఈస్ట్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.



