
గరుడ న్యూస్,సీతానగరం
సీతానగరం మండలం, బగ్గందొరవలసలో మంగళవారం శ్రీ శ్రీ శ్రీ కంత పోలమ్మ గ్రామ దేవత సిరిమాను పండుగ సందర్భంగా చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర (సిరమ్మ )దర్శించి, ప్రత్యేక పూజలు చేశారు.ముందుగా గ్రామ కమిటీ పెద్దలు సిరమ్మకు సాదర స్వాగతం పలికారు. అనంతరం వేద మంత్రాలతో ఆలయ పూజారులు సిరమ్మను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు,చిన్న శ్రీనుసోల్జర్స్ ఉపాధ్యక్షులు తోట వాసు, సోల్జర్ సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

