
గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగనూరు నియోజకవర్గ చౌడేపల్లి మండలంలోని దుర్గ సముద్రం పంచాయతీ బూటకపల్లి సమీపంలో పూలకుంట చెరువు వద్ద పేకాట ఆడుతున్న నలుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై నాగేశ్వరరావు మంగళవారం తెలిపారు. రహస్య సమాచారం మేరకు పేకాట ఆడుతున్నా వారిపై దాడులు నిర్వహించినట్లు రవి (వీరపల్లి ), మధు, ఫరీద్ ఖాన్, నాగరాజు ( రాజులూరు) పట్టుబడ్డారు. వారి నుంచి పోలీసులు రు. 5100 స్వాధీనం చేసుకుని నిందితులపై ఎస్సై నాగేశ్వరరావు కేసు నమోదు చేసినట్లు తెలిపారు