
గరుడ న్యూస్,పాచిపెంట
భూ సారం పెరగడానికి అత్యుత్తమ మార్గం నవధాన్యాలను సాగు చేసి కలియ దున్నడమే అని వ్యవసాయ అధికారి కే. తిరుపతిరావు అన్నారు. మంచాడ వలస గ్రామంలో నవధాన్యాలు వేద్దాం భూ సారాన్ని పెంచుదాం అనే నినాదంతో భూ సారాన్ని పెంచడంలో నవధాన్యాల పాత్ర పై సామూహిక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ పాడి పంట అనుసంధానానికి నవధాన్యాలు ఎంతగానో ఉపయోగపడతాయని 15 నుండి 20 రకాలు కలిపి చల్లడం వలన పశువులకు కావలసిన పశుగ్రాశం ఇంటికి కావలసిన ఆకుకూరలు కూరగాయలు కూడా నవధాన్యాల సాగు ద్వారా అందుబాటులో ఉంటాయని వేసవికాలంలో పశువులకు మంచి మేతగా నవధాన్యాలు ఉపయోగపడతాయని తెలిపారు.

