
రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,మే07,(గరుడ న్యూస్):
జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో పర్యాటకులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపిన పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ సైన్యం మెరుపు దాడులు జరిపి పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో,పాకిస్థాన్ లో పలు చోట్ల భారత వైమానిక దళం ఉగ్రవాదుల స్థావరాలను నేలమట్టం చేసి భారత ఆర్మీ సత్తా ఏమిటో పాకిస్తాన్ కు రుచి చూపించారని కాంగ్రెస్ పార్టీ మునుగోడు నియోజకవర్గం నాయకులు కుక్కల నరసింహ్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఇది నయా భారత్ అని,భారత్ తో పెట్టుకుంటే ప్రతీకార చర్యలు తప్పవని భారత సైన్యం నిరూపించిందన్నారు.పాకిస్థాన్ ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ వారికి ఆశ్రయం ఇస్తూ సహకరిస్తుంటే చూస్తూ ఊరుకోదని నిరూపించిందన్నారు.సిందూర పేరుతో భారత సైన్యం ఉగ్రవాద స్థావరాలపై రాత్రి మెరుపు దాడులు చేయడం పట్ల యావత్తూ భారత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.
