
రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,మే07,(గరుడ న్యూస్):
జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26మంది చనిపోయారని,అందుకు ప్రతీకారంగా బుధవారం తెల్లవారు జామున భారత్ సైన్యం మరియు వైమానిక దళం పాకిస్తాన్ లోని ఉగ్రవాదుల స్థావరాలపై మెరుపు దాడులు జరిపారని,పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఆరు చోట్ల మరియు పాకిస్థాన్ లో మూడు చోట్ల ప్రతీకార చర్యగా ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడులు జరిపారని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నీళ్ల లింగస్వామి గౌడ్,విలేకరుల సమావేశంలో మాట్లాడారు.ఇది కేవలం ట్రయల్ మాత్రమేనని ముందుంది మొసళ్ళ పండుగ అన్నారు.భారత్ తో పెట్టుకుంటే ప్రతీకార చర్య ఎలా వుంటుందో అని భారత ప్రభుత్వం పాకిస్తాన్ కు రుచి చూపించిందన్నారు.ఉగ్రవాద చర్యలను ఉపేక్షించేది లేదన్నారు. పాకిస్తాన్ లోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ తీసుకున్న చర్యల పట్ల దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.అందుకు ప్రధాని నరేంద్రమోదీకి,దేశ భద్రత బలగాలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
