గరుడ న్యూస్,సాలూరు
మే 7న తెల్లదొరల గుండెల్లో గుబులు పుట్టించిన మన్యం వీరుడు అల్లూరి వర్ధంతి బ్రిటిష్ శాసనానికి ఎదురు నిలిచి,ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన గొప్ప యోధుడిగా గుర్తింపు పొందిన అల్లూరి సీతారామ రాజు వర్ధంతి సందర్భంగా బుదవారం ఉదయం సాలూరు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం,మాజీ గిరిజన సంక్షేమ శాఖా మంత్రి,వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు పీడిక రాజన్నదొర ఆయన క్యాంపు కార్యాలయంలో అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో వైసీపీ సర్పంచులు,ఎంపీటీసీలు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.




