గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగనూరు నియోజకవర్గంలో గల వివిధ బ్యాంకు లలో క్రాప్ లోన్లు తీసుకున్న రైతులు రెన్యూవల్ కోసం చాలా ఇబ్బందులు పడుచున్నారు. బ్యాంకు మేనేజర్లు ఖచ్చితంగా 1 బి, అడంగళ్ కావాలని అంటున్నారు. ఐతే రెవిన్యూ కార్యాలయం లో ప్రస్తుతం అసైన్మెంట్ భూములు ఫ్రీహోల్డ్ లో ఉండటం వలన ఆన్ లైన్ అడంగల్ రావడం లేదు. అందుకోసరం అధికారులు సంతకాలు పెట్టడం లెదని మండలంలోని యల్లకుంట్ల గ్రామ పంచాయతీ, చెడుగుట్లపల్లికి చెందిన శ్రీనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ విధముగా బ్యాంకు వాళ్ళు 1బి వస్తున్ననూ అడంగల్ కు లింకు పెట్టడం ఏమాత్రం బాగలేదని, కావున వెంటనే ఉన్నతాధికారులు చొరవ చూపి 1బి ద్వారానే క్రాప్ లోన్లు రెన్యూవల్ చేయించుటకు ఆదేశాలు ఇవ్వాలని రైతులు కోరుకుంటున్నారు


