తిరుపతి జిల్లా, తిరుచానూరు గరుడ న్యూస్ (ప్రతినిధి): హరి కృష్ణ: తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పంచాయతీ సర్పంచ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రామచంద్రా రెడ్డి తండ్రి ఏలుమలై రెడ్డి భౌతిక కాయానికి చంద్రగిరి నియోజక వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు. ఏలుమలై రెడ్డి బుధవారం రాత్రి ఆకస్మికంగా మృతి చెందారు. ఆ విషయం తెలుసుకున్న చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి చెవిరెడ్డి లక్ష్మీ, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డిలు కూడా రామచంద్రారెడ్డి ఇంటికి చేరుకుని నివాళులు అర్పించారు. అనంతరం రామచంద్రా రెడ్డితో పాటు ఎంపీటీసీ నరేష్ రెడ్డి కుటుంబ సభ్యులు అందరినీ పరామర్శించి ధైర్యం చెప్పారు. విషాదంలో మునిగిన రామచంద్రా రెడ్డి కుటుంబానికి చెవిరెడ్డి కుటుంబీకులు అండగా నిలబడ్డారు.