





మఠం మాడ విధుల గుండా సాగిన రథోత్సవ వేడుకలు వీరబ్రహ్మ నామ స్మరణలతో మార్మోగిపోయింది. 5 రోజులపాటు జరిగిన ఉత్సవాలకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు మఠం సిబ్బంది పర్యవేక్షణలో వైభవంగా నిర్వహించారు. బ్రహ్మ రధాన్ని శ్రీ ఈశ్వరిదేవి మహాదేవి మఠాధిపతులు శ్రీవీర శివకుమార్ బ్రహ్మరథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పూర్వపు మఠాధిపతులు శ్రీ వీర భోగ వసంత వెంకటేశ్వరస్వామి కుమారులు, శ్రీ వెంకటాద్రిస్వామి, వీరభద్రయ్యస్వామి వీరంబట్లయ్య స్వామి, దత్తాత్రేయ స్వాములు బ్రహ్మ రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే బద్వేలు ఆర్డీవో, చంద్రమోహన్, సీఐ లు సాంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించి ప్రారంభించారు. భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో బ్రహ్మంగారిని దర్శించుకుని తరించారు.



