
గరుడ ప్రతినిధి పుంగనూరు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ మురళి నాయక్ యుద్ధభూమిలో ప్రాణాలు కోల్పోయిన వార్త తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసిందని. రాష్ట్ర విద్యార్థి విభాగ సంయుక్త కార్యదర్శి కళ్యాణ్ భరత్. మాట్లాడుతూ దేశం కోసం మురళి నాయక్ వీర మరణం పొందారని, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, మురళి నాయక్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మురళి నాయక్ కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.