గరుడ ప్రతినిధి పుంగనూరు


సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంటి పై జర్నలిస్టులపై పోలీసులు సోదాలు చేయడానికి నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఏపీ డబ్ల్యూ జె ఎఫ్ ) యూనియన్ చిత్తూరు జిల్లా కమిటీ ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు మహమ్మద్ సైఫుల్ల, పుంగనూరు నియోజకవర్గ అధ్యక్షులు సాల్వరాజు సతీష్ కుమార్, లీగల్ అడ్వాజర్ తల్లా శ్రీనివాసులు ల ఆధ్వర్యంలో పుంగనూరు, చౌడేపల్లి తాసిల్దార్ కార్యాలయం వద్ద జర్నలిస్టులందరితో కలసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తాహసిల్దార్ రాము కి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజం లో నిజాన్ని నిర్భయంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే జర్నలిస్టులపై మరియు రాష్ట్రవ్యాప్తంగా పత్రిక ప్రతినిధులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఇలాంటి చర్యలు పత్రికా స్వేచ్ఛ ను హరించడమే అవుతుందని ఇలాంటి చర్యలు పురాణార్థం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అలాగే జర్నలిస్టుల రక్షణ కొరకు చట్టాలు తక్షణమే అమలు చేయాలని కోరారు. నిరసన కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ పుంగనూరు నియోజకవర్గ శాఖ కమిటీ సభ్యులు