చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గరుడ న్యూస్ (ప్రతినిధి): R. మంజునాథ్: శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ దేవస్థానం కుప్పం శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారిని కుప్పం జాతరకు ఆహ్వానించడం జరిగినది. వారు శ్రీ వెంకటేశ్వర స్వామి సహోదరి అయిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవతకు సారి తీసుకొని జాతరకు కుప్పం వస్తున్నారు అని తెలియపరచుటకు సంతోషిస్తున్నాము 🙏🙏రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోని వయోవృద్దులు, ఒంటరి మహిళలు, వితంతువులు, విభిన్న ప్రతిభావంతులు, దీర్ఘకాలిక రోగగ్రస్తులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ ఎన్టీఆర్ భరోసా పథకాన్ని అమలు చేస్తున్నా, కుప్పం పట్టణం కొత్తపేట 14వ వార్డుకు చెందిన శశి అమ్మ వయోభారం కారణంగా వేలి ముద్రలు, కంటి పొరలు సైతం ఆధార్ కు సరిపోక పోవడంతో ఆధార్ అప్డేట్ కోసం ఆధార్ కేంద్రాన్ని సంప్రదించిన ప్రయోజనం లేక హైదరాబాదులోని ఆధార్ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించాల్సిందిగా సంబంధిత అధికారులు సూచించారని, అయితే హైదరాబాదు వెళ్లడానికి ఆర్థిక స్తోమత లేక కుప్పం నియోజకవర్గ టిడిపి విస్తరణ విభాగ కమిటీ సభ్యులు కన్నన్ ను శశి అమ్మ సంప్రదించారు. ఈ విషయమై స్పందించిన టిడిపి విస్తరణ విభాగ కమిటీ సభ్యులు శశి అమ్మ హైదరాబాదు వెళ్లి రావడానికి ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందించడం జరిగింది.ఆధార్ కార్డు సమస్యల వల్ల ఆధార్ అప్డేట్ కోసం ఆధార్ ప్రధాన కార్యాలయం విజయవాడకు వెళ్లడానికి ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది కొత్తపేట కూర్మైపురం చెందిన దళిత మహిళకు కొత్తపేట ఇంచార్జ్ అప్పుగారు 8 గం “లకు శసిమ్మ గారికి మూడు వేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది.కుప్పం మునిసిపల్ లోని వడ్డపల్లి ఊరి గంగమ్మ జాతర లో పాల్గొన్న తెలుగు దేశం పార్టీ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యేంద్ర శేఖర్, రాష్ట్ర తెలుగు యువత కార్య నిర్వాహక కార్యదర్శి చెక్కునత్తం మణి, కర్లగెట్టు యూనిట్ ఇంచార్జి గిరిధర్ పాల్గొన్నారు.