తిరుపతి జిల్లా, రేణిగుంట మండలం గరుడ న్యూస్ (ప్రతినిధి): పాకాల మురళి: తిరుపతి జిల్లాలో ఆవుల దొంగతనాలను నిర్మూలించాలనే ఉద్దేశంతో, జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు IPS గారి ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ శ్రీ రవి మనోహర్ ఆచారి పర్యవేక్షణలో, రేణిగుంట డీఎస్పీ శ్రీ వై. శ్రీనివాసరావు గారి మార్గదర్శకతనుబట్టి, రేణిగుంట రూరల్ సీఐ శ్రీ ఎం. మంజునాథ్ రెడ్డి నేతృత్వంలో, గాజులమండ్యం ఎస్.ఐ శ్రీ టివి. సుధాకర్ మరియు పోలీసు సిబ్బంది ప్రత్యేక నిఘా నిర్వహించారు. అయిల్ ఫ్యాక్టరీ జంక్షన్ వద్ద తనిఖీలు చేస్తున్న సమయంలో, ఒక బొలెరో వాహనంలో ఆవులను రవాణా చేస్తూ కనిపించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో హర్యానాకు చెందిన 8 మంది ( మహమ్మద్ రఫీ, జకీoఖాన్, మహమ్మద్ ఇమ్రాన్, ఇస్రాయిల్, తాహిర్, రాపిక్అహ్మద్, జూబర్, హనీ హనీష్. ) మరియు తమిళనాడు ఊత్తుకోటకు చెందిన,కబూర్ బాష అనే వ్యక్తి ఉన్నట్టు వెల్లడైంది. కబూర్ బాష ఈ గ్యాంగ్‌ను ఏర్పరిచి గత ఆరు నెలలుగా రేణిగుంట, వడమాలపేట, నాయుడుపేట, గూడూరు ప్రాంతాల్లో ఆవులను దొంగతనం చేసి, వాటిని కసాయిలకు విక్రయిస్తున్నట్టు తెలిపాడు. నిందితుల వద్ద నుంచి నాలుగు ఆవులు, ఒక బొలెరో వ్యాన్, ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 9 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. అంతర్‌రాష్ట్ర ఆవుల దొంగల అరెస్టుకు కారణమైన రేణిగుంట పోలీస్ బృందాన్ని,జిల్లా ఎస్పీ గారు అభినందించారు.