

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం చాంద్ ఖాన్ పల్లి గ్రామంలో స్మార్ట్ స్కాలర్ ఇన్సూరెన్స్ చేసిన అంకము అశోక్ గారు దురదృష్టవశాత్తు మరణించినందున వారి ఇన్సూరెన్స్ నామిని అయిన వారి భార్య అంకం లక్ష్మి గారికి ఇన్సూరెన్స్ రూపాయలు 10 లక్షల చెక్కు బాండు ఇవ్వడము జరిగింది. అలాగే కుటుంబ సభ్యులను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ పాప పేరు పైన ఉన్న స్మార్ట్ స్కాలర్ డబ్బులు పాప అవసరానికి ఏ సమయంలో నైన తీసుకోవచ్చని ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ మేనేజర్ రాజు రెడ్డి పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్బిఐ లైఫ్ సీనియర్ ఏజన్సీ మేనేజర్ అశోక్ మరియు ఎస్బిఐ లైఫ్ మిత్రలు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.