
గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగనూరు నియోజకవర్గంలో సోమల మండలం బోనమందవద్ద.. శ్రీ దుర్గం మల్లేశ్వర కొండలలో వెలసిన గార్గేయ మునేశ్వర స్వామి కి సోమవారం పౌర్ణమి సందర్భంగా పంచామృతాభిషేక పూజలు చేసి మహా మంగళహార సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు త్రివిక్రమ ఆచార్యులు,బాల వినయ్ కశ్యప్ ఆచార్యులు,భక్తాదులు పాల్గొన్నారు..