తిరుపతి జిల్లా, పాకాల మండలం గరుడ న్యూస్ (ప్రతినిధి): పాకాల లోని గంగమ్మ (శ్రీ సత్యమ్మ) తల్లి జాతరకు ముఖ్య అతిథిగా విచ్చేసిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. పాకాల గంగజాతర కు విచ్చేసిన పులివర్తి నాని గారికి ఘన స్వాగతం పలికిన ఆలయ కార్యవర్గ సభ్యులు, కూటమి ప్రభుత్వ నాయకులు, ప్రజలు. గంగ జాతర సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి.. ప్రత్యేక పూజలో పాల్గొని, మొక్కలు తీర్చుకున్న చంద్రగిరి ఎమ్మెల్యే. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల గంగజాతర సందర్భంగా శ్రీ సత్యమ్మ తల్లికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు పట్టు వస్త్రాలను సమర్పించారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారిని మంగళ వాయిద్యాలతో,వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ ఆలయ కమిటీ నిర్వాహకులు,స్థానికులు కలిసి ఘన స్వాగతం పలికారు. ఇక్కడ కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పు,కొంగుబంగారంగా వెలసిన శ్రీసత్యమ్మ తల్లి ప్రసిద్ధి చెందిందని స్థానిక ప్రజల ప్రగాఢ నమ్మకం.ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, ప్రజలు,భక్తులు,కార్యకర్తలు,పాల్గొన్నారు.