జిల్లా ఎస్పీ  ఎస్.వి.మాధవ్ రెడ్డి,ఐపిఎస్ ను   మర్యాద పూర్వకంగా కలిసిన నూతన ప్రొబేషనరీ ఎస్సైలు

Sivaprasad Patro
Sivaprasad Patro - Staff reporter
2 Min Read

ప్రాక్టికల్ శిక్షణ నిమిత్తం జిల్లాకు కేటాయించిన 38 మంది నూతన ప్రొబేషనరీ ఎస్సైలు..

నక్సల్ ప్రభావిత(ఎక్ష్త్రెమిస్ట్ ప్రభావిత) ప్రాంతాల పరిధి గల పోలీస్ స్టేషన్ లలో నిర్వర్తిన్చాలసిన విధి విధానాల గురించి దిశా నిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ

అనంతపురం పోలీసు శిక్షణ కళాశాలలో శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం గుంటూరు,కర్నూల్ రేంజ్ కి సంబందించిన 38 మంది నూతన ప్రొబేషనరీ ఎస్సైలును ప్రాక్టికల్ శిక్షణ(ఎక్ష్త్రెమిస్ట్ ప్రభావిత పోలీస్ స్టేషన్లు) నిమిత్తం పార్వతీపురం మన్యం జిల్లా కు కేటాయించారు. 38 మంది నూతన ప్రొబేషనరీ ఎస్ఐ లు గురువారం జిల్లా పోలీస్ కార్యాలయం నందు జిల్లా ఎస్పీ  ఎస్..వి.మాధవ్ రెడ్డి  ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్పీ  నూతనంగా పోలీస్ శాఖలోకి అడుగుపెడుతున్న ప్రొబేషనరీ ఎస్ఐలతో ఛాంబర్లో సమావేశం ఏర్పాటు చేసి వారికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేసి, వారి వివరాలు,ఏమి చదువుకున్నారు,శిక్షణ గురించి అడిగి తెలుసుకున్నారు. నక్సల్ ప్రభావిత(ఎక్ష్త్రెమిస్ట్ ప్రభావిత) ప్రాంతాల పరిధి గల పోలీస్ స్టేషన్ లలో క్షేత్ర స్థాయిలో నిర్వహించాల్సిన విధులపై అవగాహనా కల్పించేందుకు వారికి పోలీస్ స్టేషన్లను కేటాయించారు.

- Advertisement -
Ad image

ఈ సంధర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ…. విధి నిర్వహణలో నిర్భయంగా, నిష్పక్షపాతంగా, క్రమశిక్షణ, నిజాయతీ, పారదర్శకత, జవాబుదారీతనం పాటిస్తూ, ప్రజలకు అత్యుత్తమ సేవలు అందిస్తూ, పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత పెంచేలా విధులను నిర్వర్తించాలని సూచించారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఈ ప్రాక్టికల్ శిక్షణలో వారికీ కేటాయించిన ఏజెన్సీ(ఎక్ష్త్రెమిస్ట్ ప్రభావిత పోలీస్ స్టేషన్లు) పోలీస్ స్టేషన్లో ఏవిధంగా విధులు నిర్వర్తిన్చాలో తెలియజేస్తూ, పోలీస్ స్టేషన్ పరిధిలో గల గ్రామాలను తరుచూ సందర్శించాలని, ముఖ్యంగా ఏజెన్సీ(ఎక్ష్త్రెమిస్ట్ ప్రభావిత) ప్రాంతాలను సందర్శించాలని, అక్కడ ప్రజలతో సమావేశం అయ్యి వారితో మమేకమై వారికీ సైబర్, నక్షలిజమ్/మత్తుపదార్దాల/నాటుసారా వల్ల కలిగే దుష్ప్రభావాలు గరించి అవగాహన కల్పించాలన్నారు మరియు వారిద్వారా సరిఅయిన సమాచారాన్ని సేకరించాలన్నారు. ROP/కూంబింగ్ ఆపరేషన్ లు గురించి తెలుసుకొని,నిర్వహించాలని, చుట్టూ పక్కల ఏజెన్సీ(ఎక్ష్త్రెమిస్ట్ ప్రభావిత) ప్రాంతాలలో సంచరించే దళాల గురించి, వారికీ సహయం చేసేవారి గురించి వివరాలు, మునుపటిగా జరిగిన సంఘటనలు గూర్చి తెలుసుకోవాలన్నారు. వారం వారం జరిగే సంతలు సందర్శించడం, ఎక్కువ మొత్తంలో నిత్యావసర సరుకులు కొనుగోలుచేసే వారి మీద నిఘా పెట్టడం, వాహన తనిఖీలు చేయడం, ఇన్ఫర్మేషన్ సేకరించడం, ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, భద్రతా ప్రమాణమైన చర్యలు మొదలగు అంశాల గురించి క్షుణ్ణంగా నేర్చుకోవాలని, ఎక్కడా ఏవిధమైన అనుమానం వచ్చిన వెంటనే సీనియర్ అదికారులను అడిగి తెలుసుకుని నివృత్తి చేసుకోవాలని తెలియజేశారు. ఎఫెక్టేడ్ పోలీస్ స్టేషన్ లలో నిర్వర్తించే విధులు గురించి శిక్షణ నిమిత్తం వచ్చిన ప్రొబేషనరీ ఎస్సైలుకు సమాచార సేకరణ, గోప్యత, తీసుకునే భద్రతా ప్రమాణాలు వంటి అంశాల మీద క్షుణ్ణంగా  ఎస్పీ  తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో ఎస్పీ తో పాటుగా, ఏఆర్ డిఎస్పీ థామస్ రెడ్డి, ఏఆర్ ఆర్ఐ లు నాయుడు, రాంబాబు, శిక్షణ నిమిత్తం జిల్లాకి విచ్చేసిన ప్రొబేషనరీ ఎస్సైలు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *