
గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగనూరు నియోజకవర్గ సదుం మండలంలోని తాసిల్దార్ గా జయప్రకాష్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన కుప్పం ఆర్డిఓ కార్యాలయంలో పరిపాలన అధికారిక గా పనిచేస్తూ బదిలీలపై ఇక్కడికి వచ్చారు. గతంలో తాసిల్దార్ గా ఉన్న మారుప్ హుస్సేన్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ సంగతి తెలిసిందే. మండలంలో రెవెన్యూ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని జయప్రకాష్ తెలియజేశారు. కార్యాలయం సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు