
గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలోని చారాల పంచాయతీలో చౌడేపల్లి మండల టిడిపి అధ్యక్షులు గువ్వల రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీ టిడిపి కమిటీ సహకారంతో. గురువారం తెలుగుదేశం పంచాయతీ అధ్యక్షులుగా విజయ భాస్కర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా కుళాయి శ్రీనివాసులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని గువ్వల రమేష్ రెడ్డి తెలిపారు. వారు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అలాగే గ్రామ ప్రజలకు ముందుండి సేవలు చేస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..