
రిపోర్టర్ సింగ కృష్ణ,భువనగిరి స్టాపర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,మే16,(గరుడ న్యూస్):
సిబిల్ స్కోర్ నిబంధన వెంటనే ఎత్తివేయాలని లేని యెడల యావత్ తెలంగాణ రాష్ట్ర యువత పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతాయి అని హెచ్చరించడం జరిగింది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీ,బిసి,మైనారిటీ ఇబీసీ లలో ఉన్న నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు 6000 కోట్ల రూపాయలతో 5లక్షల మందికి రుణాలు ఇవ్వాలని నిర్ణయం చేసి దరఖాస్థులు స్వీకరించింది.ప్రభుత్వ నిర్ణయతో 16 లక్షల మంది నిరుద్యోగ యువత,నిరుపేదలు,దళితులు గిరిజనులు దరఖాస్తు చేసుకున్నారు.దరఖాస్థులు స్వీకారణ పూర్తి అయిన తరువాత సిబిల్ స్కోర్ ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడం లబ్ధిదారుల నోట్లో మట్టికోట్టడమే అవుతుంది అని విమర్శించారు.అంబేద్కర్ అభయహస్తం ఊసే లేదని,1లక్ష నుండి 4లక్షల నిబంధనతో పేదల బతుకుల్లో ఇలాంటి మార్పు రాదని అన్నారు.కనీసం 10లక్షలు వరకు నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందిచలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం నిర్ణయం వలన అనేక మంది పేదలకు ఒక్కరికి కూడా రాజీవ్ యువ వికాసం రుణాలు వచ్చే అవకాశం లేదనీ అన్నారు.తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం సిబిల్ స్కోర్ నిబంధనను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తుందనీ పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు.
