
గరుడ ప్రతినిధి పుంగనూరు
పుంగనూరు పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో తాసిల్దార్ రాము సమావేశం నిర్వహించారు. తాసిల్దార్ కార్యాలయంలో ఓటు నమోదు మార్పులు, చేర్పులు అలాగే ఎక్కువ జనాభా కలిగిన ప్రాంతాల్లో కొత్త పోలింగ్ స్టేషన్ ను ఏర్పాటు చేయడం లాంటి అనేక అంశాలను చర్చించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు తాసిల్దార్. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల కు చెందిన నాయకులు పాల్గొన్నారు..
