
గరుడ న్యూస్,పాచిపెంట
గ్లైఫోసేటు కలుపు మందు విక్రయం, వినియోగంపై ఆంక్షలు ఉన్నాయని అమ్మిన వారిపై, వినియోగించిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని వ్యవసాయ అధికారి కొల్లి తిరుపతిరావు తెలిపారు. పీకొనవలస, పెద్ద చీపురు వలస శ్యామల గౌరీపురం చెరుకుపల్లి గ్రామాలలో భూసారం పెంపులో నవధాన్యాల సాగు ఆవశ్యకతపై ఇంటింటి ప్రచారం మరియు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు సాధ్యమైనంత వరకు కలుపు మందులకు దూరంగా ఉండాలని ముఖ్యంగా గ్లైఫోసిట్ అనే కలుపమందు మన రాష్ట్రంలో సాధారణ వినియోగం మరియు విక్రయం నిషేధించబడ్డాయని దయచేసి ఎవరు కొనవద్దని అమ్మ వద్దని వినియోగించవద్దని దీనివలన అనేక అనర్ధాలు ఉన్నాయని జీవ వైవిధ్యం పూర్తిగా నశించిపోతుందని తెలిపారు. అంతేకాకుండా హెచ్ టి కాటన్ గా పిలవబడే గడ్డిపికల పత్తి పూర్తిగా నిషేదించబడిందని కాబట్టి రైతులు దీనిని వినియోగించరాదని ఇది పర్యావరణానికి ఎంతో ప్రమాదకరమని తెలిపారు. అనంతరం నవధాన్యాలు వేద్దాం భూసారం పెంచుదాం అనే నినాదంతో భూసారం పెంపుదలలో నవధాన్యాల పాత్రను తెలుపుతూ ఇంటింటి ప్రచారం, ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు వినోద్, నాగమణి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది విజయ్, కుమార్ పాల్గొన్నారు.

