
గరుడ న్యూస్,సాలూరు
ఆపరేషన్ సింధూర్ దేశ ప్రజలందరికీ గర్వకారణమైన విజయం. దేశ భద్రతను కాపాడేందుకు త్రివిధ దళాల సంకల్పంతో ఈ ఆపరేషన్ విజయం సాధించింది. ఈ అఖండ విజయానికి దేశం మొత్తం సెల్యూట్ చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు త్రివిధ దళాల సైతం సమిష్టిగా కృతజ్ఞతాబినందనలు తెలియజేసే సమయం ఆసన్నమైంది. ఆపరేషన్ సింధూర్ అఖండ విజయం సాధించడం పట్ల దేశ సైనిక దళాలు చూపిన శౌర్య, ధైర్య మరి త్యాగాలను గౌరవించడానికి తిరంగా యాత్ర ప్రజల భాగస్వామ్యంతో చేపట్టే ఒక గొప్ప విజయ యాత్ర.
ప్రజలు, అధికారులు, పార్టీలు పాల్గొన్న ఈ యాత్ర రాజకీయాలకు పూర్తి అతీతమని గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు.

