
గరుడ ప్రతినిధి పుంగనూరు
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం నూనెమద్దనపల్లి గ్రామానికి చెందిన మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన బురుసు నాగేంద్ర (21)ప్రేమ పేరుతో పెళ్లి చేసుంటానని మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పి నమ్మించి గర్భవతిని చేసి మోసం చేశాడు. ఈ విషయాన్ని బాధితురాలు తల్లి తండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ ఆధ్వర్యం లో చౌడేపల్లి సబ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మైనర్ బాలిక గర్భానికి నాగేంద్ర కారణ మని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ మేరకు పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ నిందితుడి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మరియు పోక్సో కేసు నమోదుచేసి అరెస్ట్ చేసి పుంగనూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎదుట హాజరు పరిచి నిందితుడికి 14 రోజులు రిమాండ్ విధించారు. మదనపల్లి సబ్ జైలుకు తరలించడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు..
