
గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగనూరు నియోజకవర్గంలో శనివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి యినిమిది గంటల వరకు కురిసిన భారీ వర్షం ఈదురుగాలులకు చెట్లలోని మామిడికాయలు 40 శాతం కాయలు నెల రాలి పోయాయి. పుంగనూరు చౌడేపల్లి సోమల సదుం మండలాల్లో అకాల వర్షం కారణంగా మామిడి కాయలు నేల రాలడమే కాకుండా చెట్లు , కొమ్మలు కూడా విరిగి నేలన పడ్డాయి ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ చేతికొచ్చిన పంట అకాల వర్షం కారణంగా నష్టపోయామని. ప్రభుత్వం వారు పంట నష్టం చెల్లించాలని వారు కోరారు