చెరువును పరిశీలించి, స్థానికులను వివరాలు అడిగి తెలుసుకుంటున్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డితిరుపతి జిల్లా, తిరుచానూరు గరుడ న్యూస్ (ప్రతినిధి): హరికృష్ణ: తిరుచానూరు: తిరుపతి రూరల్ మండలం పాడిపేట ముళ్ళపూడి మధ్యలోని పాడి చెరువులో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు విచ్చలవిడిగా మట్టిని తవ్వేస్తున్నారు ఆదివారం ఉదయం పది గంటలకు ఉపాధి కూలీలతో కలిసి మోహిత్ రెడ్డి పాడి చెరువును సందర్శించారు మోహిత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పాడి చెరువును రూపు లేకుండా ఎక్కడబడితే అక్కడ రూపురేఖలు లేకుండా తవ్వేస్తున్నారని సహజ వనరులను పాడుచేస్తూ పల్లెల్లో ప్రశాంత లేకుండా చేస్తున్నారని ఇసుక మట్టి ప్రభుత్వ భూములను అమ్ముకుంటూ కమిషన్లు తీసుకుంటూ ఉపాధి హామీ పథకం కింద కూలీలు చెరువులో గుంతలు తీసుకొని వంద రోజులు పని దినాలు పూర్తి చేసుకోకున్నారు అలాంటిది యంత్రాలతో మట్టి తవ్వేస్తూ మట్టి అక్రమార్కుల వల్ల తమకు పని లేకుండా పోతుందని పని కోసం మరొకచోటకు వలస వెళ్లాల్సి వస్తుందని ఉపాధి కూలీలు నా దృష్టికి తీసుకు వచ్చారని పాడి చెరువు పై ఆధారపడుతున్న కూలీలు కడుపు కొట్టి మట్టి అక్రమార్కులు లెక్క చేయకుండా మట్టిని తవ్వేస్తున్నారని ఆయన ఆవేదన చెందారు మట్టి అక్రమ రవాణాను అడ్డుకుంటామని గ్రామాల్లో ప్రజలు అందరూ కూడా మట్టి అక్రమాలను అడ్డుకునేందుకు ముందుకు రావాలని మీకు నేను అండగా ఉంటానని అక్కడ వచ్చినా మహిళలు గ్రామస్థులకు అందరికీ మాటిచ్చారు పాడి చెరువు అక్రమ రవాణాపై జిల్లా కలెక్టర్కు ఎస్పీలకు ఫిర్యాదు చేస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తిరుచానూరు సర్పంచ్ రామచంద్రారెడ్డి పాడిపేట సర్పంచ్ ధనముని రెడ్డి ముళ్లపూడి సర్పంచ్ సూరి రెడ్డి ఎంపీటీసీలు నరేష్ రెడ్డి యోగానంద రెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.