తిరుపతి జిల్లా, తిరుచానూరు గరుడ న్యూస్ (ప్రతినిధి): హరికృష్ణ: తిరుచానూరు, శ్రీ పద్మావతి అమ్మవారు ఆదివారం సాయంత్రం గజవాహనం పై నాలుగు మాడా వీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. అమ్మవారి జన్మనక్షత్రం ఉత్తరాషాఢ సందర్భంగా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువజామున సుప్రభాతంతో మేలుకొలిపి, నిత్య కైంకర్యాలు నిర్వహించారు. మధ్యాహ్నం శ్రీకృష్ణస్వామి ముఖ్యమండపంలో అమ్మవారి ఉత్సవమూర్తికి శాస్త్రోక్తంగా అభిషేకం చేశారు. సాయంత్రం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఉంజల్ సేవ నిర్వహించారు.అనంతరం విశేషాలంకరణలో విరాజిల్లుతున్న అమ్మవారు గజవాహనం పై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారికి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరింద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ రమేష్, ఏవిఎస్వో సతీష్ కుమార్, వి.ఐ. రాము, ఇన్స్పెక్టర్లు ప్రసాద్, సుబ్బారాయుడు, సుభాస్కర్ నాయుడు, చలపతి తదితరులు పాల్గొన్నారు.
గజ వాహనంపై మాడవీధుల్లో తిరుగుతూ భక్తులను కటాక్షించిన కరుణ గల తల్లి