గరుడ న్యూస్,సాలూరు
సాలూరు పురపాలక సంఘ ప్రజా ఆరోగ్య సిబ్బంది అందరూ ప్రత్యేక పారిశుద్ధ్య పనులు నిర్వహించి సాలూరు పట్టణం 29 వార్డుల్లో రోజువారి శానిటేషన్ పనులతో పాటు బ్లీచింగ్ లైం పౌడర్ తో కలిపిన ప్రతి వీధిలో రోడ్లపై వేయించారు.
అలాగే అమ్మవారి పండుగ మొదటి రోజు ఉయ్యాల కంబాల కార్యక్రమం పెద్ద కోమటి పేట లో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు అమ్మవారి ఆలయం, నాయుడు వీది ఏరియాలో సిరిమాను జన్ని వీధిలో అమ్మవారి గద్దె వద్ద బ్లీచింగ్ వేయడం జరిగింది.
పార్కింగ్ స్థలాలలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన మొబైల్ టాయిలెట్స్ స్థలాలలో ప్రత్యేక శానిటేషన్ పనులు నిర్వహిస్తూ సున్నంతో లైన్లో వేయించడమైనదని,
పట్టణ ప్రజలు పండుగ సందర్భంగా ప్రతి ఇంటిలో చుట్టాలు, బంధువులు విచ్చేయుచున్నారు. కావున ప్రతి ఇంటి నుండి చెత్త పెరిగే అవకాశం ఉన్నందున ఎవరు రోడ్లపై గాని కాలువలో గాని విచ్చలవిడిగా చెత్త వేయకూడదని తమ ఇంటికి వచ్చిన పారిశుధ్య కార్మికునికి తప్పకుండా అందజేయాలని తెలియజేశారు. పట్టణ ప్రజలు ఇది గమనించి పురపాలక సంఘానికి సహకరిస్తారని మున్సిపల్ కమిషనర్ డీ.టీ.వి.కృష్ణారావు,శానిటరీ ఇన్స్పెక్టర్ ఎల్. బాలకృష్ణ,సిబ్బంది కోరారు.




