గరుడ న్యూస్,సాలూరు
✳️భక్తులకు శ్యామలాంబ అమ్మవారిని సురక్షితమైన, సులభమైన దర్శనం చేసుకునే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది – జిల్లా ఎస్పి ఎస్.వి.మాధవ్ రెడ్డి,ఐపిఎస్
✳️సుమారు 900 మంది పోలీస్ అధికారుల సిబ్బందితో ప్రణాళికాబద్దమైన పటిష్ట బందోబస్తు
ఏర్పాటు చేశామన్న జిల్లా ఎస్పీ
✳️సాంస్కృతిక కార్యక్రమాలు, వాహనాలు నిలుదల చేసే ప్రదేశాలను సందర్శించి బందోబస్తు ఏర్పాట్లును స్వయంగా పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ
✳️సిరిమాను తిరిగే ప్రాంతాల్లో పురాతన భవంతులు, శిధిలావస్థలో ఉన్న భవంతులు గుర్తించి భద్రత ప్రమాణల దృష్ట్యా జాగ్రత్తలు పాటించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్న జిల్లా ఎస్పీ
✳️సిరిమాను/ఘటాలు తిరిగే ప్రాంతాల్లో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా విద్యుత్ శాఖతో , అదేవిధంగా భక్తులకు చేరువలో వైద్య సదుపాయం ఏర్పాట్లను ఆశాఖల అధికారులతో సమన్వయం చేసుకొని తగిన చర్యలు చేపట్టడం జరిగింది.
✳️శ్యామలాంబ అమ్మవారి ఆలయాన్ని, సిరిమాను ఏర్పాట్లను జిల్లా ఎస్పీ స్వయంగా సందర్శించి, బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు…
సాలూరు పట్టణంలో 18,19,20 తేదీల్లో జరిగే శ్రీ శ్యామలాంబ అమ్మవారి పండగ పురస్కరించుకుని భక్తులకు సురక్షితమైన, సులభమైన అవాంఛనీయ జరగకుండా, భక్తులు సులువుగా అమ్మవారిని దర్శించుకొనే విధంగా పటిష్టమైన ప్రణాళికతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. ఆదివారం శ్యామలాంబ అమ్మవారి ఆలయాన్ని, సిరిమాను ఏర్పాట్లును, సిరిమాను/ఘటాలు తిరిగే మార్గాన్ని, సాంస్కృతిక కార్యక్రమాలు, వాహనాలు నిలుపుదల చేసే ప్రదేశాలను, పోలీస్ అధికారులు, సిబ్బందికి కేటాయించిన బందోబస్తు ప్రతీ పాయింట్ ను జిల్లా ఎస్పీ ఎస్.వి,మాధవ్ రెడ్డి, ఐపిఎస్ స్వయంగా సందర్శించి, బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
శ్రీ శ్యామలాంబ అమ్మవారి పండగలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా, పండగను శాంతియుతంగా నిర్వహించేందుకు సుమారు 900 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. బందోబస్తును 08 సెక్టార్లుగా విభజించి, రెండు షిఫ్టుల్లో బందోబస్తు ఏర్పాటు చేసి, భక్తులు అమ్మవారిని సురక్షితమైన, సులభమైన దర్శనం చేసుకొనే విధంగా చర్యలు చేపట్టామన్నారు. పండగ రోజుల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. అంతేకాకుండా, వాహనాల రెగ్యులేషను, ట్రాఫిక్, భక్తుల రద్దీని డ్రోన్స్ తో పర్యవేక్షిస్తామన్నారు. పండగ బందోబస్తును పాలకొండ డిఎస్పీ పర్యవేక్షిస్తారన్నారు. వాహనదారులకు, ప్రయాణికులకు
ఎటువంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ రద్దీ ని బట్టి డైవర్షన్ చేసే విధంగా ప్లాన్ అఫ్ యాక్షన్ రూపొదించు కొవాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం, జిల్లా ఎస్పీ అమ్మవారి ప్రధాన ఆలయం సందర్శించి, భక్తుల క్యూ లైన్స్, బందోబస్తు ఏర్పాట్లును స్వయంగా పర్యవేక్షించారు. భక్తుల క్యూ లైన్స్ కోసం ఏర్పాటు చేస్తున్న బ్యారికేడ్లు పటిష్టంగా ఉండేలా చర్యలు చేపట్టారు. సిరిమాను తయారీ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ పరిశీలించి, సిరిమాను తిరిగే సమయంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా విద్యుత్ శాఖాధికారుల సహాయంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అదే విధంగా సిరిమాను తిరిగే ప్రాంతాల్లో పురాతన భవంతులు, శిధిలావస్థలో ఉన్న భవంతులు గుర్తించి భద్రత ప్రమాణల దృష్ట్యా జాగ్రత్తలు పాటించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, భక్తులకు చేరువలో వైద్య సదుపాయం ఏర్పాట్లు ను ఆ శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.
సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే ప్రదేశాలు వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్స్ దృడంగా ఉన్నాయా అని తనిఖీ చేసి స్టేజి ఏర్పాట్లను, ప్రజల రక్షణ కొరకు , అల్లర్లు జరగకుండా తగిన బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించారు. వాహనాలు నిపుదల చేసే ప్రదేశాలు, సిసి కేమారాలు అనుసందానం చేసి పర్యవేక్షణ కొరకు ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ సందర్శించారు. అదేవిధంగా పోలీస్ అధికారులకు సిబ్బందికి కేటాయించిన బందోబస్తు ప్రతీ పాయింట్ను జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి,ఐపిఎస్ స్వయంగా పర్యవేక్షించారు. వారికీ భోజన వసతులు సకాలంలో అందేలా, ఆరోగ్య సమస్యలు తలెత్తిన వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాలని అధికారులని జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఎవరికి కేటాయించిన విధులను వారు సక్రమంగా, నిజాయితీగా నిర్వర్తించాలని, ప్రజలతో సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు.
జిల్లా ఎస్పీ వెంట పాలకొండ డిఎస్పీ రాంబాబు, ఏఆర్ డిఎస్పీ థామస్ రెడ్డి, సాలూరు పట్టణ సిఐ అప్పలనాయుడు, ఎస్బీ సిఐ రంగనాధం, సైబర్ సెల్ సిఐ శ్రీనివాస రావు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.





