గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం లోని లద్దిగం గ్రామ పంచాయతి యస్సి కాలనీకి చెందిన శంకరప్ప కుమారుడు సందీప్ (20) లద్దిగం నుండి తిరుపతి వైపు వెళ్తుండగా సింగిరిగుంట ఇరికిపెంట మద్యలో ద్విచక్రవాహనం అదుపు తప్పి క్రిందపడి అక్కడికక్కడే మరణించాడు. స్థానికులు అదిగమణించి 108 వాహనం లో చౌడేపల్లి ప్రాథమిక ఆసుపత్రికి తీసుకొని వెళ్ళగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యసిబ్బంది తెల్పారు.మృతదేహాన్ని లద్దిగం కు తరలించారు.సోమల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


